క్షమాపణ కోరిన ఆస్ట్రేలియా...

SMTV Desk 2017-11-23 17:11:52  australia, meet, bhagavan ganesh, sorry

మెల్బోర్న్, నవంబర్ 23: హిందువుల తొలి పూజలందుకొనే ఆరాధ్య దైవం గనేశుడిని అవమానించేలా చిత్రీకరించిన ప్రకటనపై ఆస్ట్రేలియా లెంపలేసుకుంది. గత సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా వినాయకుడితో పాటు జీసస్, బుద్ధుడు, గ్రీకు దేవతలు మాంసాహార విందులో ఉన్నట్లు ఓ వీడియో ప్రకటన రూపొందించింది. గొర్రె మాంసం తినడాన్ని ప్రోత్సహించే౦దుకు మీట్, లైవ్ స్టాక్ ఆస్ట్రేలియా అనే సంస్థ ఇలా అత్యుత్సాహం ప్రదర్శించింది. దీనిపై భారత్ తో పాటు ప్రపంచంలో ఉన్న హిందువులు భగ్గుమన్నారు. అప్పట్లో సమర్ధించుకున్న ఆస్ట్రేలియా స్టాండర్డ్స్ బ్యూరో ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ ప్రకటన నియమాలను ఉల్లంఘించి౦దని ఒప్పుకుంటూ ఫిర్యాదులను విచారణకు స్వీకరించింది.