ఎనిమిది నగరాల్లో ‘సేఫ్‌-సిటీ’ ప్రణాళికలు

SMTV Desk 2017-11-23 16:53:32  womans protection, safe city, delhi

న్యూఢిల్లీ, నవంబరు 23 : ప్రస్తుత సమాజంలో మహిళల అన్యాయాల నేపథ్యంలో వారికి భద్రత కల్పించేందుకు ఎనిమిది మహానగరాల్లో త్వరలో సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు. ఈ ఎనిమిది నగరాలలో మహిళలు ఆపదలో ఉంటే తక్షణమే స్పందించే బృందాలు, పోలీసుల పర్యవేక్షణలోని ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్‌ గౌబా వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, హైదరాబాద్‌ల లో మహిళలకు ‘సేఫ్‌-సిటీ’ ప్రణాళికను అమలు చేస్తారు.