సుష్మాస్వరాజ్‌కు కేటిఆర్ పోచంపల్లి చీర బహుకరణ...

SMTV Desk 2017-11-23 16:52:53  Indian external affairs Sushma Swaraj, ktr, telangana,

న్యూఢిల్లీ, నవంబర్ 23: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా భార‌త‌ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ వేదికగా... " యూఏఈలో 11 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు సిరిసిల్ల వాసుల గురించి సుష్మాస్వరాజ్‌తో చర్చించాం. వారి గురించి యూఏఈ అధికారులతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశాం. అలాగే, సుష్మాస్వరాజ్‌కి పోచంపల్లి చేనేత చీరను బహుకరించాం." అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు చీరను బహుకరించిన ఫొటోలను పోస్ట్ చేశారు.