భువనేశ్వర్‌ @ మొహంది వేడుక సంబరాలు

SMTV Desk 2017-11-23 16:47:06  bhuvaneswar, marriage, noopor nagara, india , cricket player

న్యూఢిల్లీ, నవంబర్ 23 : భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వివాహం ఈ రోజు అంగారంగా వైభవంగా జరగనుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న రాత్రి భువనేశ్వర్ ఇంటి వద్ద మెహందీ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా భువి, నుపుర్‌ పెళ్ళికి ముందు ప్రత్యేక ఫొటో షూట్‌లో కూడా పాల్గొన్నారట. క్రికెటర్ల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చిన్ననాటి స్నేహితురాలు నుపుర్‌ నగారాతో భువి నిశ్చితార్థం అక్టోబరు 5న జరిగింది. భారత్- శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ లో భువి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.