జయ మరణించాకే వేలి ముద్రలను వాడారు

SMTV Desk 2017-11-23 16:16:34  aiadmk, dmk, karunanidi, jayalalitha.

చెన్నై, నవంబర్ 23: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాతే వేలి ముద్రలను వాడారని డిఎంకె విమర్శించింది. విచారణ కమిషన్ కు డిఎంకె వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ శరవణన్ కొన్ని సాక్ష్యాలు అందచేశారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయను గత ఏడాది చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో అన్నా డిఎంకె అభ్యర్దుల కోసం జయలలిత బి ఫారంలు ఇచ్చారని, కానీ ఆమె అప్పటికే మరణించడం వలన వేలి ముద్రలు వాడుకున్నారని ఆయన ఆరోపించారు.