రాజకీయ జీవితాంతం తెలంగాణలోనే

SMTV Desk 2017-06-13 13:23:28   Former MP Vijayasanthi, Telangana State,Political organism

హైదరాబాద్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలోనే నా రాజకీయ జీవితమంతా, తమిళనాడుకు వెళ్లిపోతానన్న సమాచారం అవాస్తవమని మాజీ ఎంపీ విజయశాంతి వెల్లడించారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని ఆమె మాటలో తెలిపారు. తమిళనాడు దివంగత సీఎం జయలలితతో తనకు మధ్య సాన్నిహిత్యం ఉందని, తానంటే ఆమెకు ఎంతో ఇష్టమని అన్నారు. జయలలిత అంటే నాకు గౌరవమని, ఆ అభిమానంతో నే సంక్షోభ సమయంలో అన్నాడీఎంకేకు మద్దతు పలికానని వివరించారు విజయశాంతి. ప్రజలకు ఎంతో సేవచేసి, మంచి పథకాలు ప్రవేశపెట్టి జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారని, అలా వచ్చిన ప్రభుత్వాన్ని కూల దోయడం సరికాదని అన్నారు. ఇక పై నా రాజకీయ జీవితమంతా తెలంగాణకే అంకితం చేస్తానంటూ ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు