నేను గాడ్సేను పోగుడలేదు :కేబినెట్‌ మంత్రి లాల్‌ సింగ్‌

SMTV Desk 2017-11-23 16:03:18  Mahatma Gandhi, madhyapradesh minister lal sing

భోపాల్‌, నవంబరు 23: స్వాతంత్ర్య సమరయోధుడైన మహాత్మాగాంధీని 1948 జనవరి 2న హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే పై మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రి లాల్‌ సింగ్‌ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే మహోన్నతమైన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో గ్వాలియర్‌లో అఖిల భారతీయ హిందూ మహా సభ నాథూరామ్‌ గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తదుపరి మాటమార్చిన ఆయన, తాను గాడ్సేను పొగుడుతూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ వెల్లడించారు.