కేన్సర్ మందులతో రక్తపోటు మాయం...

SMTV Desk 2017-11-23 15:57:01  Cancer, Blood pressure, George Town Varsity Researcher

వాషింగ్టన్, నవంబర్ 23: సమాజంలోనే ఆందోళన కలిగించే ప్రాణాంతకమైన వ్యాధి కేన్సర్, అలాంటి ఈ వ్యాధి నుండి ఉపశమనం కలిగేలా వైద్యులు మందులను కనిపెట్టారు. అయితే ఈ కేన్సర్ ఔషధాలతో రక్తపోటును కూడా నివారించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం రక్తపోటుకు వాడే మందులతో రక్తహీనత, మైకం, మలబద్ధకం లాంటి దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ కారణంగా కొత్త ఔషధాల తయారీకి అమెరికాలోని జార్జ్ టౌన్ వర్సిటీ పరిశోధకులు పరిశోధనలు ప్రారంభించారు. ఈ సందర్బంగా కొన్ని రకాల కేన్సర్ మందులు రక్తపోటును తగ్గించే గుణాలను కలిగి ఉన్నాయని వారు గుర్తించారు.