ఢిల్లీలో దట్టంగా పొగమంచు...

SMTV Desk 2017-11-23 15:08:25  smokesnow, newdelhi, trains late

న్యూ ఢిల్లీ, నవంబర్ 23: ఉత్తర భారతాన్ని పొగమంచు దట్టంగా అలుముకుంది. దేశ రాజధాని డిల్లీలో గురువారం ఉదయం నుండి భారీగా పొగమంచు పడడంతో నగర రోడ్లన్నీ చీకట్లు కమ్ముకున్నాయి. రోడ్లపై వాహనాలు లైట్లతో కనిపిస్తున్నాయి. పొగమంచు కారణంగా రైల్వే అధికారులు ఒక రైలును రద్దు చేసి 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఢిల్లీ నగరాన్ని పొగమంచు అవరించడంతో 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.