యాంకర్ రష్మీ కి పెళ్ళా?

SMTV Desk 2017-06-13 12:53:12  anchor rashmi, jabardasth anchor, tollywood

విశాఖ, జూన్ 13 : సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా అదో సంచలనం అవతుంది. కొన్ని సార్లు వారు మాట్లాడినది ఒకటి అయితే అభిమానులు ఉహించుకునేది ఇంకోటి. ఇప్పుడు యాంకర్ రష్మీ విషయం లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఓ షాప్ ప్రారంభోత్సవం నిమిత్తం నటి రష్మీ విశాఖపట్నంలో సందడి చేసారు. తన కోసం వచ్చిన అభిమానులని చూసిన రష్మీ మాటల్లో భాగంగా రెండు మాటలు జారింది. ఇప్పుడు అవే మాటలు పుకార్లు గా మారి ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లకు కారణం రష్మి చేసిన కామెంట్సే. వైజాగ్‌లోనే స్థిరడతాను అని ప్రకటించడంతో ఆమె వైజాగ్‌కు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందేమోననే ప్రచారం తెరపైకి వచ్చింది. రష్మి త్వరలో వైజాగ్ యువకుడిని పెళ్లాడబోతోంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఆమె ప్రేమిస్తోందని, త్వరలోనే పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయని రూమర్స్ స్పెడ్ అయ్యాయి. అయితే ఇదే విషయం పై రష్మీ సన్నిహితులు ఏమంటున్నారంటే...తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, రష్మీ వైజాగ్ లో స్థిరపడినంత మాత్రాన అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అని కాదని అంటున్నారు. రష్మీ మాత్రం ఇప్పడే పెళ్లి ఆలోచన లేదని, ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉందని రష్మీ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బెంగాలీ భామ గీతా ఆర్ట్స్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో ఆది సరసన నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ అవుతుంద‌ని వైజాగ్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా రష్మీ తెలిపారు.