2.0 చిత్రం విడుదల తర్వాత అభిమానులతో భేటీ కానున్న రజినీ

SMTV Desk 2017-11-23 14:48:18  Superstar Rajinikanth, media, Chennai

చెన్నై, నవంబరు 23: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ డిసెంబర్ 12న పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖడించారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో రజినీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, 2.0 చిత్రం విడుదల అనంతరం మరోమారు రాజకీయ ప్రవేశం గురించి కాకుండా కేవలం అభిమానులతో సమావేశమవుతానని పేర్కొన్నారు.