తగ్గిన జీఎస్టీ రేట్లు అమలు చేయాలి : లక్ష్మీనారాయణ

SMTV Desk 2017-11-23 14:44:53  gst, hydearbad, j. laksmi narayana, companies

హైదరాబాద్ , నవంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ ను ఫలాలను వినయోగాదారులకు అందించాలని రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వీ అనిల్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అడిషనల్ కమిషనర్ జే లక్ష్మీనారాయణ వ్యాపారులను ఆదేశించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, నగరంలోని బడాసూపర్ మార్కెట్ల ప్రతినిధులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గౌహతిలో ఈనెల10న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చాలా రకాల వస్తువులు, సేవలపై పన్ను రేటును తగ్గించారని వారు తెలిపారు. 128 రకాల సరుకులను 28 శాతం శ్లాబ్ నుంచి తప్పించి 12 నుంచి 5శాతం పరిధిలోకి చేర్చారని, ఇప్పుడు కేవలం 50 రకాల సరుకులు మాత్రమే 28శాతం శ్లాబ్ పరిధిలో ఉన్నాయని వివరించారు. ఈనెల 15నుంచి సవరించిన రేట్లు అమలులోకి వచ్చాయన్నారు. కాబట్టి ఆ రేట్ల్లకే అమ్ముతూ వినియోగదారులకు లాభం చేకూర్చాలని సూచించారు.