సీపీఎం సీనియర్‌నేత కన్నుమూత

SMTV Desk 2017-11-23 14:16:42  CPM senior leader Sukumal Sen death, kolkata

కోల్‌కతా, నవంబర్ 23 : సీపీఎం పార్టీ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌కు చైర్మన్‌గా పని చేసిన సీనియర్‌నేత సుకోమల్‌ సేన్‌(83) బుధవారం గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయనకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా ఎస్‌ వీరయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలను విశ్లేషించి, లోపాలను ఎండగట్టడంలో ఆయన దిట్ట అన్నారు. సుకోమల్‌ ప్రతి విషయాన్ని కార్మిక దృక్పథంతో అన్వయించేవారన్నారు.