టాక్సీ డ్రైవర్ ను హత్య చేసిన హిజ్రా!

SMTV Desk 2017-11-23 13:34:22  hijraa, taxi driver, murder, ap

తూర్పుగోదావరి, నవంబర్ 23: హిజ్రా చేతిలో ఓ టాక్సీ డ్రైవర్ హతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి౦ది. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం రేగుబల్ల గ్రామానికి చెందిన వన్నాల లక్ష్మణ్(34) టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల తనకు కామెర్ల వ్యాధి రావడంతో పసరుమందు కోసం గత నెల 29న రామచంద్రపురం సమీపంలోని వెల్ల గ్రామానికి వెళ్ళాడు. పసరు మందు తీసుకొని అదే రోజు తిరుగు ప్రయాణమైన అతనికి బస్ స్టాండ్ లో ఓ హిజ్రా పరిచయమైంది. వారిద్దరూ దగ్గరలో ఉన్న ట్రాక్టర్ మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్ళారు. అక్కడ హిజ్రా లక్ష్మణ్ మర్మాంగాన్ని కొరికి చంపింది. తొడంగి మండలం, కృష్టాపురం గ్రామానికి చెందిన బృతి వీరవెంకట రమణ అలియాస్ వరసాల సోనీ గా పిలిచే ఈ హిజ్రా హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేలిందని, దీంతో హత్య కేసుగా నమోదు చేసి సోనీ ని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.