నువ్వు చచ్చినా మమ్మల్ని ఏం చేయలేవు : సూసైడ్ వీడియోలో రవికుమార్

SMTV Desk 2017-11-23 13:33:45  junior assistant ravi kumar suicide, medical department.

గుంటూరు, నవంబర్ 23: వైద్యఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ సెల్ఫీ సూసైడ్ వీడియో పేస్ బుక్ లో పోస్టు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల తన ప్రమోషన్ ను అడ్డుకుంటున్నారని, లక్ష రూపాయలు ఇస్తేనే ప్రొమోషన్ చేస్తామన్నారని తను రికార్డ్ చేసిన వీడియోలో పేర్కొన్నారు రవికుమార్. లంచం ఇవ్వకుండా నీ ప్రమోషన్ ఇచ్చే ప్రసక్తి లేదని, నువ్వు చచ్చినా మమల్ని ఏం చేయలేవన్నారని ఈ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసారు. జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ లకు తన బాధను తెలుపుతున్నఈ వీడియోను చూసి, సహుద్యోగులు వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు రూ.70 వేల వరకు ముట్టజేప్పారని, అయినప్పటికీ తనపై కక్షతోనే ప్రమోషన్ ఇవ్వకుండా ఆత్మహత్యకు పాల్పడే విధంగా తనను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.