బరువును తగ్గించే పదార్ధం.. చూశారా..

SMTV Desk 2017-11-23 12:53:27  Obesity, Cinnamon, Michigan University, america,

వాషింగ్టన్, నవంబర్ 23: సమాజంలో రోజురోజుకు ఊబకాయం సమస్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలోని మిచిగాన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సమస్యపై అధ్యయనం చేశారు. ఈ సమస్యకు వంట సామాగ్రిలో ఉపయోగించే దాల్చిన చెక్కతో పరిష్కారం లభిస్తుందట. ఈ దాల్చిన చెక్క శరీరంలో కొవ్వును కరిగించడమే కాకుండా బరువును తగ్గిస్తుందని వారు తెలిపారు. అంతేకాదు రక్తంలో చెక్కర స్థాయిని తగ్గించడానికి దాల్చిన చెక్క ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దాల్చిన చెక్క తీసుకునే వారి శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుందని, తాము మొదటగా ఎలుకలపై జరిపిన పరిశోధన ద్వారా రుజువై౦దన్నారు.