బిఎండబ్ల్యు నుండి రెండు కొత్త ద్విచక్ర వాహనాలు

SMTV Desk 2017-11-23 11:37:06  bmw new bikwa, ibw expo, india bike week, goa

గుర్గావ్, నవంబర్ 23 : గుర్గావ్ లో జరిగే ఇండియా బైక్‌ వీక్‌ (ఐబిడబ్ల్యు)లో ప్రముఖ మోటరాడ్‌ సంస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ నెల 24వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోవాలో జరిగే ఇండియా బైక్‌ వీక్‌ (ఐబిడబ్ల్యు)లో ఈ సంస్థ కొత్తగా బిఎండబ్ల్యు కె 1600బి, బిఎండబ్ల్యు ఆర్‌ నైన్‌టి రేసర్‌ల ద్విచక్రవాహనాలను ఆవిష్కరించనుంది. వీటితోపాటు మరో డజను బైక్‌లను కూడా కంపెనీ ప్రదర్శించనుంది. వీటిలో బిఎండబ్ల్యు ఎస్‌ 1000 ఆర్‌ఆర్‌, ఆర్‌ 1200 ఆర్‌, ఎస్‌ 1000 ఆర్‌, ఆర్‌ నైన్‌ టి, ఆర్‌ నైన్‌ టి స్ర్కాంబర్‌, ఆర్‌ 1200 జిఎస్‌ అడ్వెంచర్‌, ఆర్‌ 1200 జిఎస్‌, ఎస్‌ 1000 ఎక్స్‌ఆర్‌, కె 1600 జిటిఎల్‌, ఆర్‌ 1200 ఆర్‌టి ఉన్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.