ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రికి అసంతృప్తి

SMTV Desk 2017-11-23 10:57:17  delhi, telangana bhavan, The Minister was dissatisfied

న్యూఢిల్లీ, నవంబర్ 23 : ఇటీవల దేశ రాజధానైనా ఢిల్లీకి పురస్కారం తీసుకోవడానికని వెళ్లిన తెలంగాణ మంత్రిని పాటించుకోకపోవడంతో, ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రి రాత్రి 11 గంటలకు తెలంగాణభవన్‌కు చేరుకున్న ఆయనకు ప్రోటోకాల్‌ సిబ్బంది కనిపించలేదు. విమానాశ్రయం నుంచి తీసుకొచ్చిన వ్యక్తి, కారు దిగ్గానే ఆయనకు ‘నమస్కారం’ పెట్టేశాడు. స్వర్ణముఖి బ్లాకులో తనకు కేటాయించిన గదికి మంత్రి వెళ్లగా, అక్కడి వారే సిబ్బందిని పిలిచి భోజనం తీసుకురావాలని చెప్పగా, ప్రస్తుతం ఇక్కడ భోజనం దొరకదంటూ, ‘గులాటి’ (సమీపంలో పేరొందిన భోజనశాల)కి వెళ్లండన్నారు. అంతలోనే అక్కడికి ఆంధ్రాభవన్‌ సిబ్బంది ఒకరు మంత్రిని గుర్తించి, హుటాహుటిన క్యాంటీన్‌ నుంచి భోజనం తెచ్చిచ్చాడు. వీటన్నింటినీ గమనించిన మంత్రి హైదరాబాద్‌ చేరుకున్న నేపథ్యంలో మంత్రినైన తనను పట్టించుకోలేదని జీఏడీలో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన గది సహాయకునిపై వేటుకు రంగం సిద్ధమైంది.