అల్టిమేట్‌ వార్‌...బ్రిటీష్ వర్సెస్ ఆసీస్

SMTV Desk 2017-11-23 10:56:30  ashes test series, england, australia, gabba stadium

బ్రిస్బేన్‌ , నవంబర్ 22 ; గత కొద్ది రోజులుగా తమ మాటల యుద్దంతో చెలరేగిపోతున్న ఆసీస్, బ్రిటష్ జట్టు ఆటగాళ్లు లు ఇప్పుడు మైదానంలో రణరంగానికి సిద్దమయ్యారు. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్నా.. ప్రతీసారి కొత్తదనాన్ని చూపుతూ.. ఉత్కంఠను.. ఉద్వేగాన్ని.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ హై ఓల్టేజ్‌ సమరానికి నేడు తెరలేవనుంది...! ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ఈ రోజు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు చారిత్రక గబ్బా మైదానం ఆతిథ్యమివ్వనుంది. ఫామ్‌ ప్రకారం ఇంగ్లాండ్‌దే పైచేయి అయినా.. స్టోక్స్‌ దూరం కావడం, ఆడుతున్నది ఆస్ట్రేలియా గడ్డపై కావడం ఆ జట్టుకు ప్రతికూలతలు. రూట్‌, కుక్‌, అండర్సన్‌, బ్రాడ్‌, మొయిన్‌ అలీ, బెయిర్‌స్టోలపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఇక ఆసీస్ ఆటగాళ్లు భారత్ తో జరిగిన సిరీస్ లో ఓటమి చవి చూశారు. గబ్బాలో ఆస్ట్రేలియా 31 ఏళ్లుగా ఓటమే చవిచూడకపోవడం విశేషం. ఏది ఏమైనా యాషెస్‌ టోర్నీ ప్రపంచ క్రికెట్ అభిమానులను రంజిప చేయడం ఖాయం.