ఒకేసారి ఏకంగా ఎనిమిది స్మార్ట్‌ఫోన్లు విడుదల...

SMTV Desk 2017-11-23 10:02:24  gionee, latest gionee mobile phones,

న్యూఢిల్లీ, నవంబర్ 23: మార్కెట్లో జియోనీ ఫోన్ల అమ్మకాలు దూసుకెళ్లుతున్నాయి. చైనా స్మార్ట్‌ ఫోన్ మేకర్ జియోనీ నుంచి ఈ వారంలో ఏకంగా ఎనిమిది స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ నెల 26న 8 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు జియోనీ ప్రకటించింది. జియోనీ ఎం7 ప్లస్, జియోనీ ఎస్ 11, జియోనీ ఎస్ 11, ఎస్ 11ఎస్ , జియోనీ ఎఫ్ 205, జియోనీ ఎఫ్ 6, జియోనీ స్టిల్ 3, జియోనీ ఎం 7 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ ఫోన్లన్నీ బేజెల్-లెస్ డిస్‌ప్లేతో రానున్నాయి.