సచిన్ రికార్డ్ ను కోహ్లీ అధిగమిస్తాడు : అక్తర్

SMTV Desk 2017-11-22 19:22:25  karachi, kohli, shoib akthar, pakisthan former cricket player

కరాచీ, నవంబర్ 22 : పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయాబ్ అక్తర్ భారత్ జట్టు కెప్టెన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో లిటిల్ మాస్టర్ సచిన్‌ తెందుల్కర్‌ నెలకొల్పిన వంద శతకాల రికార్డును పరుగుల మెషిన్‌ విరాట్‌ కోహ్లీ బద్దలుకొట్టగలడని పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బౌలర్లపై విరాట్‌ కోహ్లీదే ఆధిపత్యం. వన్డేల్లో ఇప్పటికే 32 శతకాలు సాధించి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. సచిన్ ప్రధమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన, తాజాగా లంక పై సెంచరీ బాది సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ ఫామ్‌ అందుకున్నాడు’ అని అక్తర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కోహ్లీ, వారి బృందం భారత్‌-శ్రీలంక మధ్య నాగపూర్ లో జరిగే రెండో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు.