అధ్యక్ష పదవికి ముగాబే రాజీనామా

SMTV Desk 2017-11-22 17:33:52  robert mugabe, zimbabwe, resignation letter, harere

హరారే, నవంబర్ 22 : దాదాపు 37 సంవత్సరాలుగా అప్రతిహతంగా పరిపాలించిన జింబాబ్వే పోరాట యోధుడు, రాబర్ట్ ముగాబే ఎట్టకేలకు తన అద్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన ను అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి జింబాబ్వే పార్లమెంటు అభిశంసన తీర్మా నం పెట్టడానికి సిద్ధమైన వేళ తనే స్వతహాగా అధ్యక్ష పదవిని వీడారు. ‘‘రాబర్ట్‌ గాబ్రియేల్‌ ముగాబే అను నేను జింబాబ్వే రాజ్యాంగంలోని సెక్షన్‌ 96 ప్రకారం తక్షణమే అమలయ్యేలా నా రాజీనామాను లాంఛనంగా సమర్పిస్తున్నాను’’ అంటూ రాజీనామా లేఖ పంపారు. ఈ నిర్ణయాన్ని తాను స్వచ్ఛందంగా తీసుకున్నానని, అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ముగాబే అభిశంసనకు సంబంధించి చర్చ జరుగుతుండగానే ఆయన రాజీనామా లేఖ అందడంతో.. చర్చను ముగిస్తున్నట్టు స్పీకర్‌ జాకబ్‌ ముడెండా వెల్లడించారు . గత కొద్ది రోజులుగా జింబాబ్వే లో ముగాబే తీరు వల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. 93 ఏళ్ల గల ముగాబే తన భార్య గ్రేస్ ముగాబే ను అధ్యుక్షరాలిగా చేయాలనీ నిర్ణయించగా, పార్టీ వర్గాలు వ్యతిరేకించడంతో సైన్యం అతనిని గృహ నిర్భందంలో ఉంచిన విషయం తెలిసిందే.