రాహుల్ అధ్యక్షుడైతే.. కాంగ్రెస్ నుంచి భారత్ కు విముక్తే : యూపీ సీఎం

SMTV Desk 2017-11-22 16:31:15  yogi adithyanath, rahul gandhi, congress presidant, up cm

లక్నో,నవంబర్ 22: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే దేశంలో బీజేపీ కి తిరుగుండదని ఉత్తరప్రదేశ్ సీఎ౦ యోగీ ఆదిత్యనాథ్ జోష్యం చెప్పారు. కాంగ్రెస్ ముక్త భారత్ సులభంగా రావాలంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందేనని యోగి అన్నారు. గోరఖ్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నిక నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణమేనని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.