కానిస్టేబుల్ చేతుల్లో హత్యకు గురైనా ప్రముఖ జర్నలిస్టు

SMTV Desk 2017-11-22 16:13:26  The leading journalist Sudip Dutta Bainik, murder, Constable, tripura

త్రిపుర, నవంబరు 22 : చిన్న వివాదంలో హత్యకు గురైనా ప్రముఖ జర్నలిస్టు సుదీప్‌ దత్త భౌనిక్ ఈ మేరకు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇండిజీనస్‌ పీపుల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర నిర్వహించిన ఆందోళనలో టీవీ జర్నలిస్టు శంతను భౌమిక్‌ హత్యకు గురయ్యాడు. తిరిగి అదే తరహాలో మరో జర్నలిస్టు హత్యకు గురయ్యరన్నారు. దీంతో సీపీఐ(ఎం) పాలిత రాష్ట్రం త్రిపురలో ప్రజాస్వామ్యం ప్రతిరోజు హత్యకు గురవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జర్నలిస్టు హత్యకు సంబంధించి వివరాల్లోకి వెళ్లితే...రాష్ట్ర రాజధాని అగర్తలాకు సమీపంలోని ఆర్కేనగర్‌లో త్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌(టీఎస్‌ఆర్‌)కు చెందిన కమాండెంట్‌ను కలిసేందుకు ప్రముఖ బెంగాలీ పత్రిక రిపోర్టర్‌ సుదీప్‌ దత్త భౌనిక్‌.. టీఎస్ఆర్‌ వెళ్లాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ నందగోపాల్‌ ఆయన్ను అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌, సుదీప్‌కి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో సుదీ్‌పను కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చిచంపాడు. ఫోరెన్సిక్‌ టీం ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టింది. ఈ ఘటనకు కారణమైన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించి అరెస్టు చేశారు.