బ్రహ్మాండంగా బ్రహ్మోస్ క్షిపణి...

SMTV Desk 2017-11-22 16:11:06  brahmos, nirmala sitaraman, sukhoi 30.

న్యూ ఢిల్లీ, నవంబర్ 22: భారత వాయుసేన(ఐఏఎఫ్‌)కు చెందిన సుఖోయ్‌-30ఎంకేఐ విమానం నుంచి తొలిసారిగా ప్రయోగించిన ప్రపంచ అత్యంత వేగవంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ విజయంగా దూసుకెళ్లింది. రెండు దశల్లో చేపట్టిన ఈ ప్రయోగంలో బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2.5 టన్నుల బరువైన ఈ క్షిపణికి భూమి నుంచి, గాల్లో నుంచి, సముద్రం నుంచి ప్రయాణించగల సామర్థ్యం ఉందని ఈ ప్రయోగంతో నిరూపితమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది చేరుకోగలదని, దీని వల్ల వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. క్షిపణి ప్రయోగం విజయంతం పట్ల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ హర్షం వ్యక్తం చేస్తూ... డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.