అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై చర్చలు జరిపిన సీఎం

SMTV Desk 2017-11-22 15:45:44  AP assembly, cm chandrababu, Polavaram Project

అమరావతి, నవంబర్ 22 : ఆంధ్రపదేశ్ పోలవరం ప్రాజెక్టును ఇప్పటివరకు 20సార్లు సందర్శించానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడు తెలిపారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై ఆయన ప్రసంగిస్తూ.. ఈ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేయాలన్న లక్ష్యంతోనే సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. ఈ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 20సార్లు సందర్శించానని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌, స్పిల్‌వే పనులు 72శాతం, డయా ఫ్రం వాల్‌ పనులు 47.99శాతం, మట్టి పనులు 72 శాతం పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్లు వంద శాతం పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.12,567.22కోట్ల పనులు పూర్తి చేస్తే.. కేంద్రం నుంచి రూ.4,329కోట్లు వచ్చాయి. రూ.58,391.06కోట్లకు సవరించిన అంచనాలుకేంద్రానికి పంపించామని చంద్రబాబు పూర్తి పనుల వివరాలను ఆయన తెలిపారు.