రైలు ఘాడి.. రాంగ్ రూట్లో వెళ్ళింది...!

SMTV Desk 2017-11-22 15:14:50  Missed the way train, farmers, Maharashtra, delhi

ముంబయి, నవంబర్ 22 : ఎక్కడికైనా దూరప్రాంతాలకు బైక్‌ మీదో, కార్లోనో ప్రయాణం అయినప్పుడు సహజంగా దారి తప్పుతుంటాం. కానీ రైలు దారి తప్పి దాదాపు 160 కిలోమీటర్లు వెళ్లిందంటే ఎవరైనా నమ్ముతారా. కానీ జరిగింది కూడా అదే కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీకి తరలివచ్చి జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ యాత్ర పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో వచ్చారు. ఆందోళన ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు దారి తప్పి, 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్‌ స్టేషన్‌ చేరుకుంది. దీంతో ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఊరు పేరు తెలియని ప్రాంతంలో ఇలా చిక్కుకుపోయామని.. ఇంత జరిగినా ఒక్క రైల్వే అధికారి కూడా ఇక్కడకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు