అస్వస్థత గురైన వనజీవి రామయ్య

SMTV Desk 2017-06-13 10:49:28  vanajeevi ramaiah, daripally ramulu, kcr, padmasri.

ఖమ్మం, జూన్ 13 : వృక్షో రక్షిత రక్షితః అంటూ నిత్యం వృక్షలకు తోడుగా ఉండే పద్మశ్రీ వనజీవి రామయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రాములు మొక్కలు నాటుతూ వాటి సంరక్షణ లోనే ఉంటున్నాడు. మొక్కలపై ఆయనకు ఉన్న ఇష్టాన్ని చూసిన ప్రభుత్వం ఏకంగా పద్మశ్రీని కట్టబెట్టి, వనజీవి రామయ్యగా బిరుదునిచ్చింది. కొద్దికాలం క్రితం రామయ్యకు గుండెనొప్పి రావడంతో స్టంట్‌ వేశారు. ఆదివారం అర్ధరాత్రి అస్వస్థతకు గురి కావడంతో కుటింబీకులు రామయ్యను ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మళ్లీ గుండెనొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. స్టంట్‌ వేసిన సమయంలోనే బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయినప్పటకీ ఆయన మొక్కలు నాటడం మాత్రం మానుకోలేదు. రామయ్య పరిస్థితి తెలిసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.