సెకండ్ రౌండ్ లోకి సైనా...కశ్యప్‌, సౌరభ్‌ ఔట్

SMTV Desk 2017-11-22 13:40:08  hongkong series, saina nehwal, parupalli Kashyap, badminton,

కౌలూన్, నవంబర్ 22 : హాంగ్‌కాంగ్‌ సూపర్‌ సిరీస్‌ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్‌, సౌరభ్‌ వర్మలు తొలి రౌండ్‌లోని ఓటమి చవి చూసి ఇంటి దారి పట్టారు. కశ్యప్‌ కొరియా ప్లేయర్‌ లీడాంగ్‌ కీన్‌పై, సౌరబ్‌ ఇండోనేషియా ప్లేయర్‌ టామ్మీ సుగియాట్రో చేతిలో ఓటమి పాలయ్యారు. ఇండియా స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌ హాంగ్‌కాంగ్‌ సూపర్‌ సిరీస్‌ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో 44 వ ర్యాంకర్‌ డెన్మార్క్‌ ప్లేయర్‌ మెటే పౌల్సేన్‌పై విజయం సాధించారు. సైనా తన తదుపరి రౌండ్ ను చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫెయ్‌ తో తలపడనున్నారు.