తిరిగి ఇంటికి రావాలనుకుంటే 1441కి ఫోన్ చేయండి

SMTV Desk 2017-11-22 13:18:45  Terrorist, Kashmiri police, CRPF Helpline 1441

శ్రీనగర్, నవంబర్ 22 ‌: కుట్రలకు ఎక్కువగా ప్రేరేతమిచ్చే ఉగ్రవాదుల సంస్థల్లో చేరిన కొందరు కశ్మీరీ యువకులు, తప్పు తెలుసుకుని వారి నుంచి విముక్తి పొంది తిరిగి ఇంటికి రావాలనుకుంటున్నారు. దీంతో యువతకు సాయం చేసేందుకు కశ్మీరీ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది 1441 ఫోన్‌ అనే హెల్ప్‌లైన్‌ తీసుకొచ్చారు. మదద్‌గార్‌ పేరుతో ప్రారంభించిన ఈ హెల్ప్‌లైన్‌కు ఉగ్రవాదులతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా ఫోన్‌ చేసి పోలీస్‌ సాయం కోరవచ్చని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దీన్ని ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభించి ఒత్తిడిలో ఉన్న కశ్మీరీ యువతకు సాయం చేసేందుకు ఈ హెల్ప్‌లైన్‌ ను ఉపయోగించారు. కాగా, ఇటీవల తల్లి అభ్యర్థనతో మజీద్‌ఖాన్‌ అనే ఉగ్రవాది పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మజీద్‌ఖాన్‌ బాటలో మరికొందరు ఉగ్రవాదులు కూడా ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నట్లు తెలిసింది. దీంతో అలాంటి వారికి సాయం చేసేందుకు 1441 హెల్ప్‌లైన్‌ను విస్తరించినట్లు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది వెల్లడించారు.