గ్రాండ్‌స్లామ్‌ సర్వ్‌ టైం మారింది

SMTV Desk 2017-11-22 12:50:12  itf, grand slams , new rules ,london

లండన్, నవంబర్ 22 : వచ్చే ఏడాది జరిగే గ్రాండ్‌స్లామ్‌ సీజన్‌ కోసం అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పలు నిబంధనలను సడలించింది. లండన్ వేదికగా జరిగిన సమావేశంలో, భాగంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చేసిన విజ్ఞప్తి మేరకు సర్వ్‌ షాట్‌/షాట్ క్లాక్ ను 25 సెకన్లలో సంధించేందుకు గ్రాండ్‌ స్లామ్‌ బోర్డు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ సమయం 20 సెకండ్లు గా ఉంది. అలాగే సీడింగ్స్‌ను 32 నుంచి 16 గా నిర్ణయించింది. అదే విధంగా వార్మప్ మ్యాచ్ ఐదు నిమిషాలు మాత్రమే జరగాలని, తరువాత నిముషంలో మ్యాచ్ కు అందుబాటులో ఉండాలని పేర్కొంది. అలా కాకపోతే ఆటగాడికి 20,000 డాలర్ల జరిమానా విధిస్తారు. వీటిని కేవలం నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్స్‌లో అంటే వింబుల్డన్ మరియు ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ మరియు యుఎస్ ఓపెన్లలో అనుసరిస్తారు.