హేడెన్‌ Vs స్టోక్స్‌

SMTV Desk 2017-11-22 11:59:36  hyden, ben stokes, ashes series, london

లండన్, నవంబర్ 22 : ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్‌ యాషెస్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ జట్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బ్రిటిష్ జట్టులో సగం మంది ఆటగాళ్లు ఎవరో నాకు తెలిదని అవహేళన చేశాడు. టోర్నీ జరగకముందే ఆస్ట్రేలియా జట్టు గెలిచినట్టేనంటూ ధీమా ప్రకటించాడు. అయితే హేడెన్‌ వ్యాఖ్యలకు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ స్పందిస్తూ " మా జట్టు లో సగం మంది క్రీడాకారులు తెలియదని హేడెన్‌ చెబుతున్నాడు. నిజానికి ఇద్దరు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం లేని వారు. ఈ మాత్రం కూడా తెలియని హేడెన్‌ క్రికెట్‌ పండితుడా?’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు.