సమరానికి సై...

SMTV Desk 2017-11-22 10:22:24  Ashes series, australia, england, ben stokes

ఆస్ట్రేలియా, నవంబర్ 22 : యాషెస్‌ ఈ పేరు వింటే చాలు ఇంగ్లాండ్- ఆసీస్ ఆటగాళ్ల రక్తం మరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సిరీస్ ఇరు జట్ల మధ్య యుద్ధం లాంటింది. చివరగా రెండేళ్ల కిందట హోరాహోరీగా సాగిన ఈ టోర్నీమళ్లీ రేపటి నుండి అభిమానుల ముందు రాబోతుంది. గత కొద్ది రోజులుగా ఆసీస్ మాటల యుద్దానికి తెర తీసింది. ప్రస్తుతం ఇరు జట్లు సమవుజ్జీలైపోయాయి. బ్రిటష్ జట్టు లో అల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ దూరం కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. సిరీస్‌ మధ్యలో అతను తిరిగి ఇంగ్లాండ్‌ జట్టుతో కలవొచ్చని వార్తలొస్తున్నప్పటికీ.. అది పక్కా అని చెప్పలేం. స్టోక్స్‌ ఎడబాటు జట్టుని మానసికంగా ప్రభావం చూపించేదే. ఇక కంగారుల జట్టు ఈ మ్యాచ్ కోసం ఏకంగా జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ చేత, ప్రాక్టీస్ సెషన్ చేసిదంటే ఆసీస్ ఆటగాళ్లు ఎంత కసితో ఉన్నారో వేరే చెప్పక్కరలేదు. అయితే ఇటీవల భారత్ లో జరిగిన సిరీస్ లో ఆస్ట్రేలియా ఎలా చిత్తయిందో తెలిసిందే. అయితే సొంత గడ్డపై ఆడనుండటం ఆసీస్‌కు కలిసోచ్చేఅంశం.