కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

SMTV Desk 2017-11-21 17:39:10  Malgam in Kupwara district in northern Kashmir, The killing of three terrorists

శ్రీనగర్‌, నవంబర్ 21 : జమ్ము కశ్మీర్‌లోని హంద్వారాలో లష్కరే తోయిబా భద్రత దళాలు భగ్నం చేశాయి. తాజాగా ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మగం వద్ద ఉగ్రవాదులు బస చేసి ఉన్నారని సమాచారం తెలుసుకున్న కుమింగ్ నిర్వహిస్తున్న భద్రత సిబ్బంది పై తీవ్రవాదులు మెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ప్రతిగా కాల్పులు జరిపింది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. వరుస ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించిన వర్గాలు నాలుగురు ముష్కరులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.