16 రోజుల వైద్యం.. 16 లక్షల బిల్లు..

SMTV Desk 2017-11-21 17:36:03  Fortis Memorial Research Institute, dengue, delhi,

న్యూఢిల్లీ, నవంబర్ 21: పదహారు రోజుల వైద్యానికి, రూ. 16 లక్షల బిల్లు చేతికిచ్చిన ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ద్వారకకు చెందిన ఐటీ ఉద్యోగి జయంత్ సింగ్, డెంగీతో బాధపడుతున్న తన ఏడేళ్ల కుమార్తె ఆద్యా సింగ్‌ను గురు గ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. రెండు వారాల చికిత్స తర్వాత పరిస్థితి విషమించడంతో ఆద్య కన్నుమూసింది. అయితే 16 రోజులపాటు ఆమెకు అందించిన వైద్య సేవలకు గాను ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా రూ. 16 లక్షల బిల్లు చేతికిచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఆ బిల్లును చూసి విస్తుపోయారు.