ఫేస్ బుక్ కి షాక్ ఇచ్చిన టెన్సెంట్‌

SMTV Desk 2017-11-21 16:01:13  facebook, tencent, social media, chiina

చైనా, నవంబర్ 21 : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు, టెన్సెంట్‌ సామాజిక మాధ్యమ౦ షాక్ ఇచ్చింది. చైనా కు చెందిన టెన్సెంట్‌ సోషల్ మీడియా మార్కెట్‌ క్యాప్‌ పరంగా ఫేస్‌బుక్‌ను బీట్‌ చేసింది. మంగళవారం ఇన్వెస్టర్ల కోనుగోళ్లతో ప్రపంచ దిగ్గజ సంస్థల టాప్‌ 5లో చోటు దక్కించుకుంది. చైనా సోషల్ మీడియా, వీడియో గేమ్ దిగ్గజం టెన్సెంట్ మార్కెట్ విలువలో ఫేస్‌బుక్‌ను అధిగమించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి టెన్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.15 ట్రిలియన్ హాంకాంగ్ ( 531 బిలియన్ డాలర్లు)డాలర్లుగా నమోదు చేసింది. దీంతో ప్రపంచంలోని ఐదు అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా టెన్సెంట్‌ నిలిచింది. కాగా ఫేస్‌బుక్‌ మార్కెట్‌ క్యాప్‌ 519 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మరో దిగ్గజ సంస్థ ఆపిల్‌ మార్కెట్‌ క్యాప్‌ 873 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 2.07 బిలియన్ల వినయోగాదారులు ఫేస్‌బుక్‌ ను వాడుతున్నారని అంచనా.