రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు 1,113 పోస్టులు

SMTV Desk 2017-11-21 15:10:08  Telangana state government replaces posts in junior colleges, hyderabad

హైదరాబాద్, నవంబర్ 21 ‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో పోస్టుల భర్తీకి అనుమతిని ఇచ్చింది. మొత్తం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,113 పోస్టుల భర్తీకి ఇవ్వగా, అందులో 46 ప్రిన్సిపల్‌, 781 జూనియర్‌ లెక్చరర్లు, 77 సీనియర్‌ అసిస్టెంట్లు, 76 జూనియర్‌ అసిస్టెంట్లు, 78 ఫిజికల్‌ డైరెక్టర్లు, 78 లైబ్రేరియన్‌ పోస్టులను అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ పోస్టులను భర్తీకి చేయనుంది.