కేసీఆర్‌ కుటుంబానికే బంగారు తెలంగాణ: ఎంపి రేణుకా చౌదరి

SMTV Desk 2017-11-21 14:47:03  congress mp renuka chowdary, kcr, ktr.

హైదరాబాద్, నవంబర్ 21: ప్రత్యేక తెలంగాణలో కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అని కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామన్న కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఆమె స్పందిస్తూ... కేసీఆర్‌, కేటీఆర్‌ లు అహంకారంతో మాట్లాడుతున్నారని,ప్రజలు వారికి బుద్ధి చెబుతారన్నారు. రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఖమ్మంలో, వేల మంది రైతులకు రుణ మాఫీ కాలేదని,ప్రభుత్వ సొమ్ము వడ్డీ మాఫీకే సరిపోయిందన్నారు. ఖమ్మంలోని జూలుర్పాడు మండలంలో కడుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అప్పుడే కూలుతున్నాయని హేద్దేవ చేశారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో పనికిమాలిన కబుర్లు చెప్పడం మినహా రైతుల కష్టాలు తీర్చడంలో విఫలమయ్యారన్నారు.