ఏలియన్స్ కు శాస్త్రవేత్తల సందేశం...!

SMTV Desk 2017-11-21 13:14:33  aliens, satellite, scientists, radio information, gj273.

న్యూ ఢిల్లీ, నవంబర్ 21: భూమిపై మానవ మనుగడ ఉంది. ఇలాగే మరే గ్రహంపైన గాని జీవవ్యవస్థ ఉందా...? ఈ ప్రశ్నకు సమాధానాలు విభిన్న రీతుల్లో వింటూనే ఉన్నాం. ఎలియన్స్ ఉన్నారా... ఉంటే వారితో మనం సంభాషణ జరుపవచ్చా...? అనే ప్రశ్నకు ఏలియన్స్ కు ఖగోళ శాస్త్రవేత్తలు సందేశం పంపారు. గత అక్టోబర్ లో నార్వేకు చెందిన యాంటెన్నా సాయంతో ఈ రేడియో సందేశం పంపినట్టు ఖగోళ శాస్త్రవేత్త డగ్లస్ వాకోచ్ వెల్లడించారు. ఈ సందేశంలో గణితంలోని వివిధ అంశాలతో పాటు రేడియో తరంగాలకు సంబంధించిన సంకేతాలను పంపామని ఆయన తెలిపారు.ఈ సందేశం వారికి చేరి, దానికి వారు సమాధానం ఇచ్చేందుకు 25 ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో జీజే273గా పిలిచే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు గ్రహాలపై జీవం ఉండచ్చని, ఆ రెండింటిలో ఒకటైన జీజే273బీపై నీరు ద్రవరూపంలో ఉందన్నారు. అక్కడి పరిస్థితులు జీవులు మనుగడ సాగించే విధంగా ఉన్నాయని, అక్కడ ఖచ్చితంగా జీవులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. దీంతో అక్కడుండే జీవులే లక్ష్యంగా మెసేజింగ్‌ ఎక్స్‌ ట్రా టెరెస్ట్రియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎంఈటీఐ) నిపుణులు ఒక రేడియో సందేశాన్ని పంపినట్లు డగ్లస్ వాకోచ్ వివరించారు.