ఈ నెల 28న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు

SMTV Desk 2017-11-21 11:36:39  Indian Prime Minister Narendra Modi, Ivanca Trump, Telangana Chief Minister KCR, Hyderabad,

హైదరాబాద్, నవంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సును ఈ నెల 28 ఖరారు చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు (కుమార్తె) ఇవాంకా ట్రంప్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఉంటారు. అలాగే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, భారీ పరిశ్రమల మంత్రి సురేశ్‌ ప్రభు, 36 దేశాల వాణిజ్య మంత్రులు హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య జరిగే సదస్సును ముందుగా భారత్‌ జాతీయ గీతాలతో ప్రారంభమవుతుంది. కాగా, ఈ కార్యక్రమానికి 1200 మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. కొత్తగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించిన వారు సదస్సులోని అంశాలను ఆకళింపు చేసుకొని, పారిశ్రామిక రంగంలో వారు ఎదగడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటిలో కేసీఆర్‌ స్వాగతోపన్యాసం చేసిన తర్వాత ఇవాంక, చివరగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని, ముఖ్యమంత్రి, ఇవాంకలతోపాటు 300 మంది పెట్టుబడిదారులు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విందులో పాల్గొని, తదుపరి ప్రధాని ఢిల్లీకి పయనమవుతారు. ఇవాంకా కూడా అమెరికాకు పయనం అవుతారని సమాచారం.