పిల్లల పై స్మార్ట్ ఫోన్ ల ప్రభావం

SMTV Desk 2017-06-12 17:53:39  TVs .. smart phones .. computators, TCS company,Experts ,Childrens

హైదరాబాద్, జూన్ 12 : నిత్య జీవితంలో టీవీలు.. స్మార్ట్ ఫోన్లు.. కంప్యూటర్ లు భాగమైపోయాయి. ఎంతలా అంటే వీటిని విడదీసి చూడలేనంత. ఇళ్లలోని చిన్నారులు సైతం వీటికి అతుక్కుపోతున్నారు. దీనికి కారణం ఎవరో తెలుసా.. 90 శాతం తల్లిదండ్రులే. పదేళ్లు దాటేసరికి అవి లేకుండా ఒక్క క్షణం కూడా పిల్లలు ఉండలేకపోతున్నారు.. అదీ కాకుండా అలాంటివారు పదమూడో ఏట నుంచే ఇతరులతో కలిసేందుకు ఇబ్బంది పడుతున్నారు.సమాజంలో కలవలేక, ఒంటరిగా మిగిలిపోతున్నరంటూ అధ్యయనాల్లో తేలింది. అప్రమత్తమై ఆ అలవాటును తగ్గించుకపోతే కొన్ని సమస్యలు రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. # ఆడాలని ఉన్నా....! పిల్లల్ని సాంకేతిక పరికరాలకు అతుక్కుపోయేలా తల్లిదండ్రులు చేయడం ఆందోళనకర పరిణామమని మానసిక వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత గజిబిజి జీవనంలో పిల్లలను ఎలా అదుపు చేయాలో తెలియక.. ఎక్కువమంది ఇలా చేస్తున్నారంటూ పేర్కొంటున్నారు. చిన్నారులకు ఆడుకోవాలని ఉంటుంది. కానీ ప్రోత్సహించేవారు. తీసుకెళ్లేవారు. లేక వీడియో గేమ్స్, కార్టున్ చానెళ్లకు బానిసలవుతున్నారంటూ చెబుతున్నారు. # 84 శాతం మంది ఫిదా: గతంలో హైదరాబాద్ చదువుకుంటున్న 12-18 ఏళ్ల మధ్య ఉన్న వేయి మంది విద్యార్ధులపై టీసీఎస్ సంస్థ అధ్యయనం చేసింది. ఇందులో విద్యార్ధులకు అంత్యంత ఇష్టమైన గాడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని తేలింది. 84 శాతం మంది గంట పాటు ఆన్ లైన్ లోనే ఉంటున్నారు. # ఓటమిని జీర్ణించుకోలేక: విద్యార్ధుల 13 ఏళ్ల తర్వాత వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల తెలియని ఆందోళన ఏర్పడుతుంది. ఈ సమయంలో వారిని సరైన మార్గంలో వెళ్లేలా మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. తీరిక లేదంటూ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అలాంటి పిల్లలు ఓటమిని జీర్ణించుకోలేని విధంగా మారిపోతున్నారు. టీవీ చూస్తుంటే ఆపేసినా.. స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ ట్యాప్ ను లాగేసుకున్నా వారికి ఎక్కడ లేని కోపం వస్తుంది. అప్పుడేం చేస్తారో. వారికే తెలియదు. ఆది లోనే గుర్తించి పరిష్కరించుకోకపోతే తీవ్రమైన మానసిక సమస్యగా మారే ప్రమాదముంది. # సర్దుకుపోలేరు: ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటితరం విద్యార్ధుల్లో ఎక్కువమంది సర్దుకుపోయే మనస్తత్వం లేనివారే. కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా తమకంటూ మరికొందరు ఉన్నారనే భావనే చాలామందిని బతికిస్తుంది. అయితే తనకు ఎవరూ లేరు.. తానొక్కడినే ఏదైనా చేయాలి.. లేదంటే ఇక అంతే అనే ధోరణీ సాంకేతిక పరికరాలకు పూర్తి బానిసై నవారిలో కనిపిస్తున్నది నిపుణుల మాట. # ఏం చేయాలంటే: ముందుగా మారాల్సింది తల్లిదండ్రులే మనమెలా మార్గదర్శనం చేస్తే వాళ్లు అలా ముందుకెళ్తారు. ఏదైనా శారీరక, మానసిక వ్యాయామాన్నిఇచ్చే క్రీడల్లో వాళ్లను ప్రోత్సహించాలి. నగరంలోని 80 శాతం పాఠశాలలకు అసలు మైదానాలే లేవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొనే ఉంటారు. అలాంటప్పుడు ఇంటికి రాగానే బయటికి వెళ్లోద్దని, ఆడుకోవద్దని చెబుతూ ఆంక్షలు పెట్టొద్దు. వీలైనంత ఎక్కువ సేపు ఆడుకోనివ్వాలి. అప్పుడే అలసిపోయి పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఉత్సాహంగా కలిగే మంచి.. చెడును వివరించాలి. # ఎవరితోనూ మాట కలపక: మొదటి కొలువు సాధించిన వారిలో కొంతమంది మూడు నెలలు తిరగకుండానే రాజీనామా చేస్తున్నట్లుగా ఓ విశ్వవిద్యాలయం సర్వేలో తేలింది. వీరు ఎక్కడున్నా ఒక్కరే టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు.. ఎవరితోనూ మాట కలపడం లేదు. చదువు పూర్తి కాగానే దొరికే కొలువులో ఇమడలేక పోతున్నారు. అణకువ, సర్దుకుపోయే మనస్తత్వం, ఇతరులతో కలిసి ముందు కెళ్లడం, బృందంలో పనిచేయడం వంటివి లేకపోవడమే ఇందుకు కారణం.