ప్రేగ్, నవంబర్ 21 : మహిళా టెన్నిస్ లో పోరాటమే పరమావధిగా ప్రస్థానం కొనసాగించిన, చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ యానా నొవోత్నా విధి ఆడిన ఆటలో ఓడిపోయింది. 49 ఏళ్ల వయసు గల నొవోత్నా కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ, చికిత్స పొందుతూ ఆదివారం అమె తుది శ్వాస విడిచారు. 1987 నుంచి 1999 వరకు సాగిన తన కెరీర్ ఆసాంతం నొవాత్నా 24 సింగిల్స్, 76 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 1993లో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) చేతిలో, 1997లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) చేతిలో వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయిన నొవోత్నా... 1998లో నటాలీ తౌజియట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఎట్టకేలకు తన వింబుల్డన్ టైటిల్ స్వప్నాన్ని సాకారం చేసుకుంది.