రైతులకు అందుబాటులో అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం : చంద్రబాబు

SMTV Desk 2017-11-20 14:54:36  ap cm chandrababu naidu, agriculture tele conference, vishaka agri tech.

అమరావతి, నవంబర్ 20 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విశాఖ అగ్రిటెక్ సరస్సుతో టెక్నాలజీపై రైతులలో అవగాహన పెంచినట్లు తెలిపారు. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం మన రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రైతుల జీవన ప్రమాణాలు పెరిగి ఈ వ్యవసాయం లాభసాటి కావాలని, రాష్ట్రం ప్రపంచానికే తలమానికం కావాలని ఆకాంక్షించారు. కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళ౦ జిలాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, తెగుళ్ళు, వల్ల పంట నష్టం జరగడం బాధాకరమన్నారు. ఓడీఎఫ్‌కు సహకరించేందుకు మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చిందని తెలిపారు. ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.