అది ఫేక్ అకౌంట్, అది ఫాలో అవ్వొద్దు : సింగర్

SMTV Desk 2017-11-20 14:34:17  singer sunitha, fake accounts, facebook,

హైదరాబాద్, నవంబర్ 20 : రోజు రోజుకి సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతూ పోతున్నాయి. వేరే వ్యక్తుల పేర్లతో సోషల్ మీడియాలో అకౌంటు ఓపెన్ చేయడం, ఇతరుల అకౌంట్స్ ను హ్యాక్ చేయడం ఈ రోజుల్లో మామూలైపోయింది. తాజాగా ఇలాంటి సమస్యనే ప్రముఖ సింగర్ సునీత ఎదుర్కొన్నారు. తన పేరు మీద ఫేస్ బుక్ లో ఎవరెవరో అకౌంట్స్ ఓపెన్ చేశారని, అలాంటి ఫేక్ ప్రొఫైల్స్ ని ఎంకరేజ్ చేయవద్దన్నారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ ద్వారా వారు మెసేజింగ్, చాటింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో తాను చాలా అప్ సెట్ అయినట్లు తెలిపారు. ఫేస్ బుక్ లో తన అకౌంట్ కు బ్లూ కలర్ టిక్ ఉంటుందని, తనను ఫాలో కావాలి అనుకుంటే ఆ బ్లూ టిక్ ను చూసి ఫాలో అవ్వాలని అభిమానులకు సూచించారు.