ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వరల్డ్ రికార్డు..

SMTV Desk 2017-11-20 14:13:52  Indian Air Force World Record, c -130 Super Hercules Plane.

న్యూఢిల్లీ, నవంబర్ 20 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. సీ-130 సూపర్ హెర్క్యులస్ ప్లేన్ 13 గంటలా 31 నిమిషాల పాటు ఆగకుండా ప్రయానించినందుకు గాను ఈ రికార్డును సొంతం చేసుకున్నట్లు వాయుసేన వెల్లడించింది. ఈ విమానం 18 వ తేదీ రోజు తెల్లవారు జామున బయలుదేరి, తిరిగి సూర్యాస్తమయం తరువాత ల్యాండ్ అయిందని తెలిపింది. ప్రస్తుతం ఈ విమానాన్ని సైనిక ఉపకరణాల రవాణాకు వాడుతున్నారు. చదునుగా లేని రన్ వేలపై సులువుగా ల్యాండింగ్ కావడం, టేకాఫ్ తీసుకోవడం వంటివి ఈ విమానం ప్రత్యేకతలు. కాగా మొత్తం 13 సీ-130 విమానాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది.