అర్హులందరికీ పక్కా ఇళ్లు: జగన్

SMTV Desk 2017-11-20 14:05:46  jagan paadayathra updates, jagan, ysrcp

కర్నూలు, నవంబర్ 20: నాలుగేళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో అక్కచెల్లెమ్మలు ఎన్నో బాధలు పడ్డారని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా హుస్సేనాపురంలో జరిగిన మహిళా సదస్సులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సంబంధించి వాళ్ల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు రావాలి అన్నారు. అలా ఎన్నికల ముందు చెప్పి పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాల కోసం కేటాయించాల్సిన రూ. వెయ్యి కోట్లను తొలగించారని చెప్పారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో బెల్టు షాపులు రద్దు చేస్తాం అన్నారు. నాలుగేళ్లు అవుతుంది చేశారా? రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందా లేదా? ఇది బాబు పాలన. ఇవాళ అందరికి చెప్తున్న మన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చెయ్యబోతున్నామో మీరు తెలుసుకోవాలి. ఇవాళ పిల్లల్ని చదివించాలంటే కష్టతరమైన పరిస్థితిలను తల్లులు ఎదుర్కొంటున్నారు. వారందరికి చెబుతున్నా మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతారో అప్పుడే మన బతుకులు మారతాయి. గ్రామాల్లో ఇళ్లు లేని వారు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ హామీ ఇస్తున్నా గ్రామాల్లో సొంత ఇళ్లు లేని వారు లేకుండా చేస్తా. ఇందుకోసం గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ప్రారంభించి మూడు రోజుల్లో ఇళ్లు, పెన్షన్లు మంజూరయ్యేలా చేస్తామని జగన్ చెప్పారు.