పట్టాభిషేకానికి వేళాయరా

SMTV Desk 2017-11-20 13:54:31  Congress Party President Sonia Gandhi, Working Committee meeting, rahul gandi

న్యూఢిల్లీ, నవంబర్ 20 : నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో అధ్యక్షతన వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాహుల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేసి ముహూర్తం ఖరారు చేసింది. అయితే సాంకేతికంగా అధికార బదలాయింపు కోసం ఎన్నికలు జరపనుంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అదే నెల 4న నామినేషన్లు స్వీకరిస్తారు. 16న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 19న ఫలితాలు వెల్లడించనున్నారు. రాహుల్‌ గాంధీ ఒక్కరే నామినేషన్‌ వేసి, ఇంకేవరూ వేయకపోతే.. నామినేషన్ల పరిశీలన రోజే ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. డిసెంబర్‌ 5న రాహుల్‌ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.