వారణాసి లో "అజ్ఞాతవాసి"

SMTV Desk 2017-11-20 13:35:01  agnathavasi movie, pawan kalyan, director trivikram, varanaasi shooting.

హైదరాబాద్, నవంబర్ 20 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో "అజ్ఞాతవాసి" చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకోగా.. హైదరాబాద్, యూరప్ లలో ఈ సినిమాకి సంబంధించి ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా చిత్రబృందం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను వారణాసి.. అలహాబాద్ ప్రాంతాల్లో ప్లాన్ చేసింది. త్వరలోనే ఈ సినిమా టీమ్ వారణాసి బయల్దేరనుంది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించారు. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.