భారతీయ ప్రపంచ సుందరీమణులకు హ్యాట్సఫ్...

SMTV Desk 2017-11-20 13:20:26  indian miss worlds, miss world, manushi chiller

హైదరాబాద్, నవంబర్ 20: 1951 లో యునైటెడ్ కింగ్డమ్ లో తొలిసారి మొదలైన ప్రపంచ సుందరి పోటీలు ప్రతియేటా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 67 సార్లు ఈ పోటీలను నిర్వహించగా ఆరు సార్లు భారతీయ వనితలు విజేతలుగా నిలిచారు. ప్రపంచ సుందరి తొలి విజేతగా స్వీడన్ కు చెందిన కికి హకన్సన్ 1951 లో ఎంపిక అయ్యింది. ఈ పోటీలు మొదలైన తరువాత 16 వ పోటీలో తొలిసారి భారత్ తరపున రీటా ఫరియా 1966 లో విజేతగా నిలిచింది. మళ్లి భారత్ ఈ పోటీలో విజయం సాధించడానికి 28 సంవత్సరాలు పట్టింది. 1994 లో ఐశ్వర్యారాయ్ ప్రపంచ సుందరిగా, భారతీయ రెండవ వనితగా నిలిచింది. మళ్లి భారత్ తరపున 1997 లో డయానా హేడెన్, 1999 లో యుక్తా ముఖి, 2000 సంవత్సర౦లో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందారు. ఆ తరువాత మళ్లి 17 సంవత్సరాలకు 2017 చైనా లో జరిగిన పోటీల్లో మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడి౦చింది.