పవర్ స్టార్ షేర్ చేసిన ఫోటో..

SMTV Desk 2017-11-20 11:53:08  Pawan Kalyan, Everyday Hero Hakim, London.

హైదరాబాద్, నవంబర్ 20 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు నిమిత్తం లండన్ వెళ్ళిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన "ఎవ్రీ డే హీరో" అంటూ హకీం అనే బంగ్లా దేశీయుడిని పరిచయం చేస్తూ.. ఎప్పుడు లండన్ వెళ్ళిన హకీం లండన్ మొత్తం తిప్పి చూపిస్తాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన రాజకీయ ప్రయాణం కోసం హకీం ఇచ్చిన విలువైన సలహాలు, పలు జాగ్రత్తలు చాలా విలువైనవని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని ఆయనకు మాటిచ్చానని పవన్ తెలిపారు.